![]() |
![]() |

కార్తీక దీపం సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా కార్తీక దీపం సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. ఇది నవ వసంతం పేరుతో ప్రసారం అవుతోంది. కాకపోతే ఇది డిఫరెంట్ స్టోరీ. ఇక వంటలక్కను, డాక్టర్ బాబును మళ్ళీ చూసేసరికి ఆడియన్స్ కి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. ఇక ఈ సీజన్ ఎంట్రీతోనే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వంటలక్కను, డాక్టర్ బాబు తీసుకొచ్చేసింది శ్రీముఖి. ఇక ఎల్లో కలర్ శారీలో వంటలక్క అద్దిరిపోయింది. కార్తీక దీపం వెల్కమ్ పార్టీ పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇంతలో ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి "మీరు కలిసి ఉంటే బాగుంటుంది " అని అడిగేసరికి "కలిసుండాలా, కలిసి ఉంటే కథ లేదు" అని చెప్పింది వంటలక్క. తర్వాత డాక్టర్ బాబును చాల ప్రేమతో, గారంగా పిలిచింది.
"డాక్టర్ బాబు వస్తారా..." అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో "సిరిమల్లె పువ్వా అనే సాంగ్ ని ప్లే చేశారు. తర్వాత డాక్టర్ బాబు మంచి గెటప్ లో వచ్చాడు.. స్టేజి మీద ఏర్పాటు చేసిన ఊయలలో వంటలక్కను కూర్చోబెట్టి అటు ఐతే ఊపాడు. తర్వాత అవినాష్ వచ్చి డాక్టర్ బాబు కాళ్ళు పట్టుకున్నాడు. "మీ కాళ్ళు పట్టుకుంటా ఈ సీరియల్ లో మీరు వంటలక్కను ఇబ్బంది పెట్టకండి" అంటూ సరదాగా సెటైర్ వేసాడు. కార్తీక దీపం ఫస్ట్ సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది బీభత్సమైన హిట్టు. డాక్టర్ బాబుని, వంటలక్కని పొగిడేవాళ్లు మోనితను తెగ తిట్టేవాళ్ళు. ఇక ఈ సీజన్ లో వంటలక్క, డాక్టర్ బాబు తప్ప అందరినీ మార్చేశారు. క్యారెక్టర్లు అన్నీ కొత్తవే. అసలు స్టోరీనే కొత్తది. కానీ ఈ సీరియల్ ని చూస్తే అల-వైకుంఠపురం మూవీనే చూస్తున్నట్టుగా ఉంది అంటూ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |